: నా మాటే కాదు... నిర్ణయమూ గట్టిదే: జ్యోతుల నెహ్రూ
‘నా మాటే కాదు... నిర్ణయమూ గట్టిదే’ అని టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ రోజు ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నెహ్రూ మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే టీడీపీలో చేరానని, రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని అన్నారు. సమాజాన్ని అర్థం చేసుకునే శక్తి ప్రతిపక్షానికి ఉండాలని, అయితే, ప్రజల బాధలను పట్టించుకునే స్థితిలో ప్రతిపక్షం లేదని అన్నారు. కాపుల అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని జ్యోతుల నెహ్రూ అన్నారు.