: బార్ డ్యాన్సర్లను ముట్టుకున్నా, వారిపై డబ్బులు వెదజల్లినా జైలు తప్పదు!


ముంబయి బార్ డ్యాన్సర్లను ముట్టుకున్నా, వారిపై డబ్బులు వెదజల్లినా ఇకపై జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ మేరకు మహారాష్ట్ర క్యాబినెట్ కొత్త బిల్లును ఈరోజు ఆమోదించింది. రేపు దీనిని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బార్లలో డ్యాన్స్ చేసే సమయంలో డ్యాన్సర్లను ముట్టుకున్న వారికి, వారిపై డబ్బులు విసిరిన వారికి జైలు శిక్షతో పాటు రూ.50,000 వరకు జరిమానా, ఎటువంటి అనుమతులు లేకుండా డ్యాన్స్ బార్ నిర్వహించే వారికి రూ.25 లక్షలు జరిమానా విధించేలా ఈ కొత్త బిల్లును రూపొందించినట్లు సమాచారం. డ్యాన్సర్లు ధరించే దుస్తులు అతి కురచగా ఉండకూడదని, శరీరాన్ని కప్పి ఉంచకుండా ఉండే దుస్తులు ధరించకూడదని, అసభ్యంగా డ్యాన్స్ చేయకూడదని, డ్యాన్స్ బార్ ప్రవేశ ద్వారాల వద్ద సీసీటీవీల ఏర్పాటు, ఒక నెల రోజులకు సంబంధించిన వాటి రికార్డింగ్ లు బార్ యజమానుల వద్ద ఉండాలని, స్వార్థ ప్రయోజనాలకు డ్యాన్సర్లను ఉపయోగించుకోవాలని చూసే యజమానులకు రూ.10 లక్షలు జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష తప్పవనే అంశాలు ఆ కొత్త బిల్లులో ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News