: ఎన్టీఆర్ గార్డెన్స్ కు నష్టం వాటిల్లదు...125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి 14న భూమి పూజ: కడియం


దేశంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. 125 అడుగుల పొడవైన ఈ భారీ కాంస్య విగ్రహాన్ని ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో నిర్మించడం వల్ల దానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన స్పష్టం చేశారు. ఆ నాలుగెకరాల స్థలం అలానే ఉంటుందని ఆయన చెప్పారు. దాని పరిసరాల్లో ఉన్న 36 ఎకరాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేస్తారని ఆయన తెలిపారు. అలాగే లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ భవన్ స్థానంలో అంబేద్కర్ టవర్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News