: పుట్టంగళ్ ఆలయ సమీపంలో మూడు కార్ల నిండా బాంబులు... ప్రమాదంపై కొత్త అనుమానాలు!
కేరళలోని కొల్లం సమీపంలోని పుట్టంగళ్ ఆలయం సమీపంలో ఈ ఉదయం పేలుడు పదార్థాలతో నిండిన మూడు కార్లు పోలీసుల కంటబడటం కలకలం రేపింది. నిన్న ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈ కార్లు అక్కడే ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు సోదాలు చేయగా వీటి నిండా బాంబులు తదితర పేలుడు పదార్థాలు ఉన్నట్టు తెలిసింది. ఆ వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందానికి సమాచారం ఇవ్వగా, వారు వీటిని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనతో నిన్నటి బాణసంచా ప్రమాదంపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం వెనుక విద్రోహ కోణం దాగి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రమాదానికి బాణసంచా అంటుకోవడం ఓ కారణమైనప్పటికీ, బాంబు పేలుళ్లు కూడా సంభవించి వుండవచ్చన్న అనుమానాలతో అధికారులు సోదాలను ముమ్మరం చేశారు.