: మహారాష్ట్రలో కరవుకి కారణం సాయిబాబాను పూజించడమే!: స్వరూపానంద స్వామి సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలో సాయిబాబాను పూజించడం వల్లే కరవు వచ్చిందని శంకరాచార్య స్వరూపానంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి షిర్డీలో సాయిబాబాకు ఆరాధనలు చేయడం వల్లే కరవు, నీటి కొరత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. శని సింగనాపూర్ లోని శనీశ్వరాలయంలోకి మహిళలను అనుమతించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా మహిళలను అనుమతించడం వల్ల భవిష్యత్ లో అత్యాచారాలు పెరుగుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.