: ఇకపై నాలుగు గంటల్లోనే డెలివరీ చేస్తాం: ‘స్నాప్ డీల్’
ఈ-కామర్స్ వ్యాపారంలో దూసుకుపోతున్న ‘స్నాప్ డీల్’లో కొనుగోలు చేసిన ఏ వస్తువైనా ఇకపై నాలుగు గంటల్లోనే వినియోగదారుల ముందుంటుంది. ఈ మేరకు తాము నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశిష్ చిత్ర వంశీ పేర్కొన్నారు. డెలివరీ టైమ్ ను గత ఏడాది కంటే 70 శాతం పెంచుకున్నామని, ఇప్పటివరకు సెల్ ఫోన్ల విక్రయానికే పరిమితమైన నాలుగు గంటల డెలివరీ సమయాన్ని మరిన్ని వస్తువులకు కూడా వర్తింపజేస్తున్నట్టు చెప్పారు. కాగా, దాదాపు ‘స్నాప్ డీల్’ వినియోగదారులు కొనుగోలు చేసే 99 శాతం ఉత్పత్తులను అదేరోజు డెలివరీ ఇస్తున్నామన్నారు. అయితే, ఇప్పుడు ఆయా ఉత్పత్తులను నాలుగు గంటల్లోనే అందించే ప్రణాళికలు చేస్తున్నామని చిత్ర వంశీ తెలిపారు.