: బెంగాల్ లో రెండో విడత... అసోంలో తుది దశ పోలింగ్
పలు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ లోని 31 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అసోంలోని 61 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశతో అసోం అసెంబ్లీకి పోలింగ్ పూర్తి కానుంది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న పలు నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ క్రమంలో పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం భారీ సంఖ్యలో భద్రతా బలగాలను రంగంలోకి దించింది.