: గంగోత్రి చూసినప్పుడే అనుకున్నా!: సుబ్బరామిరెడ్డి
'గంగోత్రి' సినిమా చూసినప్పుడే అతను మంచి నటుడవుతాడని అంచనా వేశానని కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. సరైనోడు ఆడియో విజయోత్సవ వేడుకలో ఆయన మాట్లాడుతూ, అల్లు అర్జున్ ఒక కసితో నటుడయ్యాడని అన్నారు. బన్నీ పలు సినిమాల ద్వారా తనను తాను నిరూపించుకున్నాడని ఆయన చెప్పారు. అల్లు అరవింద్ తనకు చిరకాల మిత్రుడని ఆయన అన్నారు. అప్పట్లోనే అల్లు అరవింద్ ను సలహాలు చెప్పాలని కోరేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. చిరంజీవి తనకు ప్రాణస్నేహితుడని ఆయన తెలిపారు. సినిమా అద్భుత విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.