: బాబు మంచి ఊపుమీదున్నాడు, అవుటైనా బ్యాటివ్వడు: పృధ్వీ


వైజాగ్ లో జరుగుతున్న 'సరైనోడు' ఆడియో విజయోత్సవ వేడుక సందర్భంగా హాస్యనటుడిగా అలరిస్తున్న '30 ఇయర్స్ ఇండస్ట్రీ' డైలాగ్ ఫేం పృధ్వీ మాట్లాడుతూ, 'బాబు మంచి ఊపుమీదున్నాడు...అవుటైనా బ్యాటివ్వడు' అంటూ చమత్కరించారు. ఈ సినిమాలో తనకు మంచి పాత్ర ఇచ్చారని, తనతో మంచి కామెడీ ట్రాక్ చేయించారని, అందర్నీ అది అలరిస్తుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన...'అడవిలో ఉన్న ఏనుగును అడుగు, నీట్లో ఉన్న మొసలిని అడుగు, గన్ లో ఉన్న బుల్లెట్ ను అడుగు, నేనెవరో చెబుతాయి' అంటూ సినిమా డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు.

  • Loading...

More Telugu News