: మృతులకు 10 లక్షలు, తీవ్ర గాయాలకు 2 లక్షలు, స్వల్ప గాయాలకు 50 వేలు: ఉమెన్ చాందీ ప్రకటన


కేరళలోని కొల్లంలో పుట్టింగళ్ దేవి ఆలయంలో సంభవించిన అగ్ని ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ నష్టపరిహారం ప్రకటించారు. ఈ తప్పిదం నుంచి ఆ కుటుంబాలు కోలుకోవడం కష్టమని అభిప్రాయపడ్డ ఉమెన్ చాందీ ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారంగా అందజేయనున్నామని తెలిపారు. అలాగే తీవ్ర గాయాలపాలైన వారికి 2 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వనున్నామని, స్వల్పగాయాలతో బయటపడ్డవారికి 50 వేల రూపాయలు అందజేయనున్నామని ఆయన తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వనున్నట్టు ప్రధాని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 106 మంది మృత్యువాత పడగా, 280 మంది గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని, దీనికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News