: ఎప్పుడు ఓకే చెప్పాలో...ఎప్పుడు కట్ చెప్పాలో కూడా నాకు తెలియదు: షారూఖ్ ఖాన్


తనకు ఎప్పుడు షాట్ కు ఓకే చెప్పాలో, ఎప్పుడు కట్ చెప్పాలో కూడా తెలియదని, అందుకే దర్శకత్వం జోలికి వెళ్లడం లేదని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తెలిపాడు. ఫ్యాన్ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఎంతో అనుభవమున్న మీరు దర్శకత్వ బాధ్యతలు ఎప్పుడు చేపడతారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, దర్శకత్వమంటే భయమని చెప్పాడు. 'దర్శకత్వం అంటే అన్ని శాఖలమీద పట్టుండాలి. చాలా విషయాలు తెలిసి ఉండాలి' అన్నాడు. తెరముందు పని చేసినంత బాగా తెరవెనుక పనిచేయలేనని షారూఖ్ వెల్లడించాడు. దర్శకుడిగా మారేందుకు రానున్న ఐదేళ్లలో తనను తాను మలచుకుంటానని షారూఖ్ చెప్పాడు. తెరపై కథ ఎలా చెప్పాలో తర్ఫీదు తీసుకుంటానని షారూక్ చెప్పాడు.

  • Loading...

More Telugu News