: మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అరెస్ట్
రెండు నెలల క్రితం ఎంబీటీ నేత అంజాదుల్లా ఖాన్ పై దాడి చేసిన కేసులో మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలను శనివారం అరెస్ట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు పోలింగ్ జరిగిన ఫిబ్రవరి 2న ఘటన జరుగగా, బలాలతో పాటు కార్పొరేటర్ మినాజుద్దీన్, మరో 40 మంది ఎంఐఎం కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. విచారణ అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు మలక్ పేట ఇన్ స్పెక్టర్ గంగారెడ్డి వెల్లడించారు. బలాల, మినాజుద్దీన్ లను రిమాండ్ కు పంపించినట్టు తెలిపారు.