: 300 వాహనాలు, భారీగా కార్యకర్తలు... ఎ1 కన్వెన్షన్ వేదికగా రేపు టీడీపీలోకి జ్యోతుల!


నిన్నటి వరకు వైకాపాలో కొనసాగిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆయన చేరికను ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటరు ఇందుకు వేదిక కానుండగా, సాయంత్రం 5 గంటలకు జరిగే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా జ్యోతులను ఆహ్వానించనున్నారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి 100 బస్సులు, 200కు పైగా కార్లలో జ్యోతుల అభిమానులు విజయవాడకు రానున్నారని తెలుస్తోంది. కాగా, ఆయన సమీప బంధువు పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ లు రెండు రోజుల క్రితమే తెలుగుదేశంలో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News