: 9 వికెట్ల తేడాతో సూపర్ జెయింట్స్ ఘన విజయం
గత రాత్రి జరిగిన ఐపీఎల్-2016 తొలి పోరులో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని పుణె సూపర్ జెయింట్స్ జట్టు ఘన విజయం సాధించింది. గత సంవత్సరపు చాంపియన్ ముంబై ఇండియన్స్ తో పోటీపడిన ధోనీ టీం, టాస్ ఓడిపోయి, తొలుత ఫీల్డింగ్ చేయాల్సి రాగా, నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. 122 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ జెయింట్స్, మరో 32 బంతులు మిగిలివుండగానే గెలుపు తీరాన్ని చేరుకుంది. ఓపెనర్ రహానే 66, ప్లెసిస్ 34, పీటర్సన్ 21 పరుగులతో రాణించారు.