: రోహిత్ శెట్టి సినిమాలో తమన్నా?
2005లో 'చాంద్ సే రోషన్' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన తమన్నా భాటియాకు బాలీవుడ్ లో చేసిన 'హిమ్మత్ వాలా', 'ఎంటర్ టైన్ మెంట్', 'హమ్ షకల్స్' సినిమాలు పెద్దగా పేరు తీసుకురాలేదు. 'బాహుబలి' తమన్నాను మరోసారి బాలీవుడ్ గుర్తుచేసుకునేలా చేసింది. దీంతో తమన్నాను క్రేజీ ఆఫర్ వరించింది. 'బాజీరావ్ మస్తానీ' వంటి సూపర్ హిట్ కొట్టిన రణ్ వీర్ సింగ్ తో తమన్నా జోడీ కట్టనుంది. ఈ సినిమాను భారీ యాక్షన్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి తీయనుండడం విశేషం. ఈ సినిమా వివరాల గురించి రోహిత్ శెట్టిని అడగగా, వేచి ఉండమని చెప్పాడు. ప్రస్తుతానికి ఏదీ చెప్పలేనని, అయితే రణ్ వీర్ ఎనర్జీ, దక్షిణాది చిత్రపరిశ్రమలో తమన్నా క్రేజ్ ఈ సినిమాకు మరింత బలాన్నిస్తాయని అన్నాడు. అంటే సినిమా దాదాపు ఖరారైనట్టే కదా? అని బాలీవుడ్ పేర్కొంటోంది.