: అమితాబ్ బచ్చన్‌పై కాంగ్రెస్ విమర్శలు.. ఆ ప్రాజెక్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్ బీని తొలగించాలని డిమాండ్
పనామా పేపర్స్ వెల్లడి చేసిన నల్ల కుబేరుల జాబితాలో అమితాబ్ పేరు ఉండడంతో ప్రతిష్టాత్మక 'సేవ్ టైగర్ ప్రాజెక్ట్' బ్రాండ్ అంబాసిడర్ గా ఆయనను తొలగించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత రాధాకృష్ణ విఖే పాటిల్ ఈ విషయమై మాట్లాడుతూ.. అమితాబ్ బచ్చన్ పనామా పత్రాల కేసులో క్లీన్ చీట్ పొందేవరకు ఆయన సేవ్ టైగర్ ప్రాజెక్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండకూడదని డిమాండ్ చేశారు. అలాగే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ సర్వీస్ సెంటర్ బంద్రా కుర్లా కాంప్లెక్స్ అభివృద్ధిలో సలహాదారుడి హోదా నుంచి కూడా అమితాబ్‌ను తొలగించాలని వ్యాఖ్యానించారు.