: ఆ ప్రశ్నకు కచ్చితంగా నా దగ్గర సమాధానం లేదు: నోబాల్‌పై అశ్విన్
ట్వీ20 వరల్డ్‌కప్‌లో కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ వేసిన నోబాల్.. వెస్టిండీస్ ఆటగాడు సిమ్మన్స్‌కు లైఫ్ ఇచ్చి ఆ జట్టు గెలుపుకి కారణమైందని పలువురు విశ్లేషకులు, అభిమానులు విమర్శించిన సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా అశ్విన్ వేసిన నో బాల్‌ను తప్పుబట్టాడు. అయితే దీనిపై అశ్విన్ స్పందించాడు. తాను ఆ మ్యాచ్‌లో ఒక నోబాల్ వేసినప్పటికీ.. అభిమానుల పాలిట విలన్‌ను మాత్రం కాలేదని వ్యాఖ్యానించాడు. అయితే నోబాల్‌పై తనను ప్రశ్నిస్తే తన దగ్గర సమాధానం లేదని నొక్కిచెప్పాడు. 'నేను నో బాల్ వేసినా దాన్ని భూతద్దంలో చూపలేదు' అని అశ్విన్ అన్నాడు. తనను విలన్ చేయలేదని చెప్పాడు. అయితే, విండీస్ సెమీఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం మూడు రోజుల పాటు తాను న్యూస్ పేపర్ను చూడలేదన్నాడు. అభిమానులు నోబాల్ విషయమై ఏమనుకున్నారో తనకు తెలియలేదని పేర్కొన్నాడు.