: షార్ట్ వేసుకున్న ఒక్క అమ్మాయిని ఆక్షేపిస్తే, అందరూ అలాగే వచ్చేశారు!
బెంగళూరులోని లా యూనివర్శిటీలో విద్యార్థినులకు, ఓ ప్రొఫెసర్ కు మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. తన తరగతికి షార్ట్ వేసుకుని వచ్చిన ఓ అమ్మాయిని సదరు ప్రొఫెసర్ ఆక్షేపించగా, మరుసటి రోజు తరగతి గదిలోని అందరమ్మాయిలూ షార్ట్ లు వేసుకునే వచ్చారు. తామేసుకున్న దుస్తుల గురించి కామెంట్లేంటని, తాము ఎలాంటి దుస్తులను వేసుకోవాలన్నది ఆయనకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. యూనివర్శిటీలో ప్రొఫెసర్ వేధింపులు పెరిగిపోతున్నాయని ఆరోపించిన విద్యార్థినులు ఇండిపెండెంట్ కమిటీని వేసి దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆ ప్రొఫెసర్ స్పందిస్తూ, తాను చేసింది మంచి పనేనని, దర్యాఫ్తునకు సిద్ధమని, విచారణలో భాగంగా ఏం అడిగినా సమాధానం చెబుతానని అంటున్నారు.