: న్యాయవ్యవస్థపై గౌరవం ఉంది: సుజనా చౌదరి
భారతీయ న్యాయవ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రజా సంబంధ విధులు, బాధ్యతల్లో తీరిక లేనందువల్ల కోర్టుకు హాజరుకాలేకపోయానని అన్నారు. మారిషస్ బ్యాంకుకు 106 కోట్ల రూపాయల ఎగవేత కేసులో నాంపల్లి కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం మూడు సార్లు అవకాశం కల్పించినా హాజరు కాకపోవడంతో ఆయనను అరెస్టు చేయాలంటూ న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.