: నాగార్జున గారూ! నేనో పెయింట్ వేశా, కాస్త అమ్మిపెట్టండి: సోషల్ మీడియాలో యాంకర్ సుమ


తన వాక్చాతుర్యం, సమయస్ఫూర్తితో తెలుగువారి ఇంట్లోని పిల్లలా గలగలా మాట్లాడేస్తూ అందర్నీ ఆకట్టుకునే యాంకర్ సుమ ఓ పెయింట్ వేసింది. పైగా అలాంటిలాంటి పెయింట్ వేయలేదు...'ఊపిరి' సినిమాలో కార్తీ వేసిన పెయింట్ కు బాబు లాంటి పెయింట్ వేసింది. ఇప్పుడా పెయింట్ కొనేవారికోసం చూస్తోంది. ఇంతలో నాగార్జున గుర్తుకొచ్చి... 'నాగార్జున గారూ! మా పిల్లల స్ఫూర్తితో నేనో పెయింట్ వేశాను...వాటర్ ట్యాంకర్లకు డబ్బుల్లేవు... దీనిని అమ్మిపెట్టండి' అని ఫేస్ బుక్ అకౌంటులో తను వేసిన పెయింట్ పోస్టు చేసింది. దీనికి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కాగా, 'ఊపిరి' సినిమాలో నాగార్జున 20 లక్షల రూపాయలు పెట్టి ఓ పెయింటింగ్ కొనడం చూసిన కార్తీ, తను కూడా ఓ పెయింట్ వేస్తాడు. అతనిపైనున్న అభిమానంతో పిచ్చిగీతల్లా ఉన్న ఆ పెయింట్ ను రెండు లక్షల రూపాయలకు ప్రకాష్ రాజ్ కు నాగార్జున అంటగడతాడు. దీనిని స్పూర్తిగా తీసుకుని సుమ ఓ పెయింట్ వేసింది. దానిని అమ్మాలని నాగార్జునను కోరుతోంది. మరి నాగ్ ఏమంటారో చూడాలి!

  • Loading...

More Telugu News