: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టిక్కెట్ల వివాదం... ఆందోళనలో పవన్ ఫ్యాన్స్!


రేపు విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టిక్కెట్లపై విజయవాడలో వివాదం నెలకొంది. ఈ విషయమై డిస్ట్రిబ్యూటర్, మల్టీ ప్లెక్స్ యజమానుల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో మల్టీప్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ల అమ్మకాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఐనాక్స్, పీవీఆర్, సినీ పోలిస్ థియేటర్ల దగ్గర ప్రేక్షకులు పడిగాపులు గాస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News