: నితీష్ నిర్ణయంతో దేవుడికి ‘చుక్క’ ఎదురు!
బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో, మందుబాబులకే కాదు, దేవుళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేమిటి! దేవుళ్లు ఇబ్బంది పడటమంటారా!.. ఆ విషయానికొస్తే, బీహార్ లోని దళితులు, మహా దళితులు పూజించే దాక్ బాబా, మసాన్ బాబా, గొరైయ బాబా, దిహ్వాల్ బాబా, నౌఖా బాబా, భైరవ్ తదితర దేవుళ్లకు నైవేద్యంగా మద్యం సమర్పిస్తారు. బీహార్ లో మద్యం నిషేధించడంతో ఆ దేవుళ్లకు ‘మద్యం’ నైవేద్యం ఆగిపోయింది. దీంతో, గయలోని పలు ప్రముఖ ఆలయాలకు భక్తులు రాకపోతుండటంతో పూజారులు దిక్కులు చూడాల్సి వస్తోంది. ఈ సందర్భంగా గోదావరి మోహల్లా భైరవ స్థాన్ ఆలయ పూజారి అనంత్ మరాథే మాట్లాడుతూ, తమ దేవుడు కపాల్ బైరవ మద్యాన్ని మాత్రమే నైవేద్యంగా స్వీకరిస్తారని... ప్రస్తుత పరిస్థితుల కారణంగా నైవేద్యం సమర్పించలేక పోతున్నామని, అది సాధ్యం కాకపోవడంతో భక్తులు ఆలయాలకు రావడం లేదని అన్నారు.