: అమితాబ్ నా ఆఫీసుకు రావడం అద్భుత క్షణం: వర్మ
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన ఆఫీసుకి రావడం అద్భుత క్షణమని దర్శక సంచలనం రామ్‌గోపాల్‌వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈరోజు పుట్టిన రోజును జరుపుకుంటున్న వర్మ.. తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వారందరికీ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాను ముంబైలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసు గురించి కూడా ట్వీట్ చేశారు. 'కంపెనీ పేరుతో నేను కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసుకి సర్కార్ (అమితాబ్) రావడం అద్భుత క్షణం' అని వర్మ పేర్కొన్నారు. బిగ్ బీ తన ఆఫీసుని వీక్షిస్తుండగా తీసిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. అమితాబ్ వెంటే నడుస్తూ తన కంపెనీ మొత్తాన్ని వర్మ చూపించారు.