: మహిళల కోసం తొలి స్వదేశీ కండోమ్ ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం


మహిళలు గర్భనిరోధక సాధనంగా వాడుకునేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తిరువనంతపురంలోని హెచ్ఎల్ఎల్ రీసెర్చ్ సెంటరులో తయారు చేసిన కండోమ్ 'వెల్వెట్'ను కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా మార్కెట్లోకి విడుదల చేశారు. అవాంఛిత గర్భధారణను నివారించే ఈ కండోమ్ మహిళలకు ఎంతో ఉపయుక్తకరమని, సహజంగా లభించే రబ్బరు పాలతో దీన్ని తయారు చేశామని వివరించారు. ఎలాంటి ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా పునరుత్పత్తికి సంబంధించి మహిళలకు పూర్తి స్వేచ్చ లభిస్తుందని ఆయన తెలిపారు. కాగా, 2010 నుంచి హెచ్ఎల్ఎల్ ఈ తరహా కండోమ్ పై రీసెర్చ్ ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కండోమ్ లు విదేశాలకు కూడా ఎగుమతి కానున్నాయి.

  • Loading...

More Telugu News