: ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిగమ్ బోధ్ ఘాట్‌లో కమలా అద్వానీ అంత్యక్రియలు
బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ సతీమణి కమలా అద్వానీ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. గుండెపోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ రోడ్‌లోని అద్వానీ నివాసంనుంచి కమలా అద్వానీ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. నిగమ్ బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు జరుగుతాయని అద్వానీ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.