: మరోసారి పింక్‌ బాల్ ఉప‌యోగించ‌నున్న'క్రికెట్ ఆస్ట్రేలియా'


సరికొత్త ప్రయోగాలకు వేదిక‌గా నిలిచే 'క్రికెట్ ఆస్ట్రేలియా' మరో నిర్ణ‌యం తీసుకుంది. రానున్న రెండు టెస్ట్ సిరీస్‌ల‌లో మ‌రోసారి పింక్ బాల్ ఉప‌యోగించ‌నుంది. ఆస్ట్రేలియాలో త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న డే నైట్ టెస్ట్ మ్యాచుల్లో పింక్ బాల్‌ను వాడ‌నున్న‌ట్లు అక్క‌డి మీడియా పేర్కొంది. పింక్ బాల్‌ను ఆస్ట్రేలియా తొలిసారిగా 2015లో న్యూజిలాండ్‌తో టెస్ట్ సంద‌ర్భంగా ఉప‌యోగించింది. ఇప్పుడు స్వ‌దేశంలో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌తో జ‌రగ‌నున్న టెస్ట్ మ్యాచుల్లో మ‌రోసారి పింక్‌బాల్‌ను ఉప‌యోగించే దిశ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News