: కోహ్లీ, అనుష్క కలిసిపోయారా?... కలిసి విందు ఆరగించారంటున్న ‘మిస్ మాలిని డాట్ కాం’


భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల జంటపై వచ్చినన్ని వార్తలు ఇంకే సెలిబ్రిటీ కపుల్ పైనా వచ్చి ఉండవేమో. ఇతరులకు భిన్నంగా తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బహిరంగంగానే వెల్లడించిన ఈ జంట... ఆ తర్వాత ఉన్నపళంగా దూరం జరిగింది. అప్పటిదాకా చేతిలో చేయి వేసుకుని తిరిగిన ఈ జంట... ప్రస్తుతం ఎక్కడ కనిపించినా, సింగిల్ గానే కనిపిస్తున్నారు. అయితే ముంబైకి చెందిన ‘మిస్ మాలిని.కామ్’ అనే వెబ్ సైట్ కథనం ప్రకారం... కోహ్లీ, అనుష్క మళ్లీ జత కలిశారు. ముంబైలోని బాంద్రాకు చెందిన ఓ రెస్టారెంటుకు ఇటీవల కలిసి వచ్చిన ఈ జంట ఎదురెదురుగా కూర్చుని విందారగించారు. ఈ వార్తలే నిజమైతే... మున్ముందు మైదానంలో కోహ్లీ వీర విహారం చేస్తుంటే, స్టాండ్స్ లో నుంచి అనుష్క చేయి ఊపే దృశ్యాలు మళ్లీ కనువిందు చేయనున్నాయి.

  • Loading...

More Telugu News