: ఆమెను కో-పైలట్ గా ఇస్తేనే విమానం నడుపుతా... అంటూ విమానాన్ని రెండు గంటలు ఆపేసిన ఎయిర్ ఇండియా పైలట్


తనకు నచ్చిన మహిళా పైలట్ ను కో-పైలట్ గా ఇవ్వలేదన్న కారణంతో మాలే నుంచి తిరువనంతపురం మీదుగా చెన్నై వెళ్లాల్సిన విమానాన్ని రెండు గంటలు ఆలస్యం చేశాడో పైలట్. మొత్తం 110 మంది పాసింజర్లు విమానం ఎక్కిన తరువాత ఈ ఘటన జరిగింది. సదరు మహిళా పైలట్ ను కేటాయించేందుకు అధికారులకు సమయం ఇస్తూ, తనకు బీపీ పెరిగిందని ఫిర్యాదు చేశాడు. చికిత్స పేరిట కాసేపు నాటకం ఆడాడు. ఏఐ 263/264 పేరిట నడిచే విమానంలో తనకు ఆ మహిళా పైలట్ నే ఇవ్వాలని రోస్టర్ సెక్షన్ కు ముందే సమాచారం ఇచ్చాడట. అది కుదరదని, మహిళా పైలట్ ను మరో విమానానికి కేటాయించామని చెబితే, ససేమిరా అంటూ విమానాన్ని కదిలించేందుకు భీష్మించాడని ఏఐ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఉదయం 7 గంటలకు బయలుదేరాల్సిన విమానం, 9 గంటల తరువాత బయలుదేరింది. దీనిపై అధికారికంగా స్పందించేందుకు ఏఐ ప్రతినిధులు అందుబాటులో లేరు.

  • Loading...

More Telugu News