: మే 27 నుంచి ఊటీలో ఫ్లవర్ షో...15,000 రకాల పుష్పాల ప్రదర్శన


ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఊటీలో మే 27వ తేదీ నుంచి ప్రతిష్ఠాత్మక 120వ ఫ్లవర్ షో ప్రారంభం కానుంది. ప్రతి ఏటా నిర్వహించే ఫ్లవర్ షో లో భాగంగా దీనిని నిర్వహిస్తున్నట్లు హార్టికల్చరల్ విభాగం డైరైక్టర్ ఎల్. చిత్రసేనన్ పేర్కొన్నారు. ప్రభుత్వ బొటానికల్ గార్డెన్స్ లో మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఫ్లవర్ షోలో దాలియా జాతికి చెందిన 35 రకాల పుష్పాలతో పాటు, సుమారు 15,000 రకాల విభిన్న పుష్పాలను ఈ ప్రదర్శనలో ఉంచనున్నట్లు చెప్పారు. కాగా, మే 21, 22 తేదీల్లో 58వ ఫ్రూట్ షోను కూనూరుకు సమీపంలోని ప్రముఖ సిమ్స్ పార్క్ లో నిర్వహించనున్నట్లు చిత్రసేన్ తెలిపారు. అయితే, వెజిటబుల్, రోజ్, స్పైసెస్ షోలను ప్రతి ఏటా మే మొదటి లేదా రెండో వారంలో నిర్వహించటం ఆనవాయతీ అని, అయితే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాటిని రద్దు చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News