: నారా లోకేశ్ కు మంత్రి పదవి ఇవ్వాల్సిందే!... కృష్ణా జిల్లా టీడీపీ బీసీ సెల్ తీర్మానం


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతల నుంచి ఈ డిమాండ్లు వరుసగా వినిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న లోకేశ్ కోసం తమకు అందివచ్చిన పదవులను త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ లు బహిరంగంగా ప్రకటించారు. తాజాగా నేటి ఉదయం విజయవాడలో కృష్ణా జిల్లా టీడీపీ బీసీ సెల్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన సమావేశమైన ఈ సెల్... నారా లోకేశ్ ను తక్షణమే మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బీసీ సెల్ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి పంపుతామని ఆ సెల్ నేతలు చెప్పారు.

  • Loading...

More Telugu News