: ప్రేమజంటలకు రక్షణ కల్పించేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరణ
తాము కులాంతర వివాహం చేసుకోవాల్సి వుందని, దీంతో పెద్దల నుంచి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కోరుతూ వచ్చిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రంలో వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు వివాహమాడితే, కిరాయి ముఠాలు దాడులు చేసి హత్యలు చేస్తున్నాయని ఆరోపిస్తూ, ఓ కుల సంఘం నాయకుడు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రేమజంటలకు భద్రత కల్పించేలా ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఎన్నికల తరువాత మరోరూపంలో రావాలని పిటిషనర్ కు సూచించింది.