: కేరళలో ప్రిన్సిపాల్ కు వెరైటీ గురుదక్షిణ... పదవీ విరమణ రోజున 'సమాధి' కట్టారు!


విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు అత్యంత దారుణమైన అవమానం జరిగిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళలో 127 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన విక్టోరియా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీ.ఎన్.సరసు మార్చి 31న పదవీ విరమణ చేశారు. అయితే కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఆమె పదవీ విరమణ పొందిన రోజున కళాశాల ఆవరణలో ఆమె పేరిట ఓ సమాధిని తయారు చేసి, దానిపై పుష్పగుచ్ఛాలు ఉంచారు. ఈ ఘటనపై ఆల్ కేరళ గవర్నమెంట్ టీచర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సరసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ప్రిన్సిపల్ గా ఉన్న సమయంలో విద్యార్థులు చేసిన డిమాండ్లను అంగీకరించలేదన్న అక్కసుతోనే వారు ఈ పని చేశారని ఆమె ఆరోపించారు. కాగా, ఆమె అదే కళాశాలలో 27 ఏళ్ల పాటు జువాలజీ ప్రొఫెసర్ గా సేవలందించారు.

  • Loading...

More Telugu News