: ప్రత్యూషను రాహుల్ ఆత్మహత్యకు ప్రేరేపించాడు: ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
'బాలికావధు' సీరియల్ ద్వారా పాప్యులర్ అయిన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రత్యూష ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ను రెండుసార్లు విచారించిన పోలీసులు...ప్రత్యూష ఆత్మహత్యకు కారణం రాహుల్ అని తేల్చారు. రాహుల్ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కాగా, ప్రత్యూష ఆత్మహత్య అనంతరం షాక్ కు గురైన రాహుల్ శ్వాస సంబంధిత ఇబ్బందితో ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యూష బెనర్జీని తన మాజీ ప్రేయసితో కలిసి రాహుల్ మానసిక, శారీరక హింసకు గురి చేసినట్టు, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.