: ఆత్మహత్య అంతటి మూర్ఖమైన పని ఇంకోటి లేదు: డ్రీమ్ గర్ల్


ఆత్మహత్య అంతటి మూర్ఖమైనపని ఇంకోటి లేదని ప్రముఖ బాలీవుడ్ నటి హేమామాలిని అన్నారు. 'బాలికావధు' సీరియల్ ద్వారా పాప్యులారిటీ సంపాదించుకుని, ప్రియుడితో విభేదాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య హేమామాలినిని ఆవేదనకు గురయ్యేలా చేసింది. దీంతో ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. జీవితం దేవుడిచ్చిన వరమని పేర్కొన్న ఆమె, దానిని హరించే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు. జీవితం అనేది ఆనందించేందుకే ఉంది తప్ప, అంతం చేసుకునేందుకు కాదని ఆమె హితవు పలికారు. కష్టాలను ఎదుర్కొని ఎలా నిలదొక్కుకోవాలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఆమె తెలిపారు. ప్రపంచం పోరాడే వారిని కీర్తిస్తుంది తప్ప, పరాజితులను కాదని ఆమె అన్నారు. సెలబ్రిటీల ఆత్మహత్యలు ఆకలి గొన్న మీడియాకు ఆహారం లాంటివని, మరో సెన్సేషనల్ వార్త వచ్చేవరకు దానినే ప్రసారం చేస్తాయని, ఆ తరువాత దానిని మర్చిపోతాయని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News