: అఫ్రిది స్థానంలో సర్ఫరాజ్... మారిన పాక్ కెప్టెన్


అందరూ ఊహించినట్టుగానే వరల్డ్ కప్ టీ-20లో ఘోర వైఫల్యం తరువాత పాక్ జట్టు కెప్టెన్ గా షాహిద్ అఫ్రిది రాజీనామా చేసిన నేపథ్యంలో, టీ-20 జట్టుకు నూతన సారధిగా వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ అహ్మద్ ను నియమిస్తున్నట్టు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ ప్రకటించారు. అన్ని విషయాలనూ చర్చించిన మీదటే సర్ఫరాజ్ నియామకం జరిగిందని, కొత్త బాధ్యతలను అతను సక్రమంగా నిర్వహించి విజయవంతం కావాలని కోరుకుంటున్నానని ఖాన్ వ్యాఖ్యానించారు. కెప్టెన్ గా నియామకంపై ఈ ఉదయం సర్ఫరాజ్ తో మాట్లాడానని అన్నారు. బోర్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అంతకుముందు జట్టు ప్రదర్శనపై వకార్ యూనిస్ ఇచ్చిన నివేదికపైనా చర్చ జరిగింది. ఏ మాత్రం ఆలోచన లేకుండా అఫ్రిది నిర్ణయాలు తీసుకుని జట్టు పేలవ ప్రదర్శనకు కారకుడయ్యాడని ఐదు పేజీల నివేదికలో వకార్ ఆరోపించాడు.

  • Loading...

More Telugu News