: సందడి చేస్తున్న పవన్ కల్యాణ్, లెజెనివాల కుమార్తె 'పోలెనా' ఫోటో ఇదే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మూడవ భార్య అన్నా లెజెనివాల గారాల పట్టీ పోలెనా ఫోటోలు తొలిసారిగా సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఇటీవల జరిగిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహానికి లెజెనివా హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పోలెనా మిగతా పిల్లలతో కలసి ఆడుకుంటూ సందడి చేసిందట. ఆ ఫోటోలను సంపాదించుకున్న పవన్ అభిమానులు ప్రస్తుతం వాటిని ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సైట్ల ద్వారా షేర్ మీద షేర్ చేసుకుని మురిసిపోతున్నారు. ఈ పాప చిత్రాలు ఇప్పటివరకూ బయటకు రాకపోవడంతో పలువురు దీనిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. తల్లి ఒడిలో కూర్చున్న పోలెనా చిత్రం ఇదే.