: ఏకీకృత స‌ర్వీస్ రూల్స్‌ ఫైలుపై కేసీఆర్ సంత‌కం.. రాష్ట్ర‌ప‌తి ఆమోద‌మే త‌రువాయి


తెలంగాణ‌ రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగులందరికీ ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు సీఎం కేసీఆర్‌ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. ఏకీకృత స‌ర్వీస్ రూల్స్‌పై రాష్ట్ర‌ప‌తి ఆమోదానికి పంప‌నున్న ఫైలుపై ఆయన సంత‌కం చేశారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఉద్యోగులకు వేర్వేరు సర్వీసు రూల్స్ ఉండడంతో.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మధ్య ఉద్యోగుల పరస్పర బదిలీలకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పంచాయతీరాజ్‌, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు రూల్స్‌ను వేగంగా రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News