: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పోరులో మ‌రో రెండు టీమ్స్ చేరాలి: ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌


భవిష్యత్తులో నిర్వ‌హించ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మొద‌టి, రెండో రౌండ్స్‌ మ్యాచ్‌లలో మరో రెండు జట్లు చేరాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్సన్‌ చెప్పారు. టీ20 వరల్డ్‌ కప్‌ ప్రస్తుత విధానంపై సంతృప్తి చెందిన‌ట్లు క్రికెట్ రేడియోకు చెప్పారు. ఈ వరల్డ్‌ కప్‌లో మ్యాచ్‌ లన్నీ అద్భుతంగా జరిగాయని, మొద‌టి, రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో జట్ల మధ్య గట్టి పోటీ క‌న‌బ‌డింద‌న్నారు. భవిష్యత్తులో తొలి రౌండ్‌లో ప్రతి గ్రూప్‌లో ఒకటి లేదా రెండు జట్లను అదనంగా చేర్చి టోర్నీ కాలాన్ని పెంచే ప్రయత్నం చేస్తామ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News