: జగన్ ఎప్పటికీ మారడా?: సోమిరెడ్డి ఫైర్


ఓవైపు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను చేపట్టి జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు తెచ్చుకుంటే, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధికి జగన్ అడ్డు తగులుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్ ఎప్పటికీ తన వైఖరిని మార్చుకోడా? అని ప్రశ్నించిన ఆయన, వేలాది ఎకరాలకు సాగునీరందించే పట్టిసీమను విమర్శించడం తగదని హితవు పలికారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు. యువనేత లోకేష్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పార్టీ అభ్యన్నతికి కృషి చేస్తున్నారని, లోకేష్ వంటి వారు మంత్రివర్గంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News