: ఆర్ఎస్ఎస్, బీజేపీలు దేశాన్ని వెన్నుపోటు పొడిచాయి: కేజ్రీవాల్
ఆర్ఎస్ఎస్, బీజేపీలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. పాకిస్థాన్ సంయుక్త దర్యాప్తు బృందం(జిట్)ను ఇండియాలోకి అనుమతించడం ద్వారా ఆర్ఎస్ఎస్, బీజేపీలు దేశాన్ని వెన్నుపోటు పొడిచాయని ట్వీట్ చేశారు. ఓ వైపు 'భారత్ మాతాకీ జై' అని నినాదం చేస్తూ.. మరోవైపు ఐఎస్ఐను భారతావనిలోకి అనుమతించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పఠాన్కోట్ ఉగ్రదాడి ఘటన భారత్ ఆడిన నాటకమని పాకిస్థాన్ దర్యాప్తు బృందం చెప్పిందంటూ పాకిస్థాన్ మీడియా పేర్కొన్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ ట్వీట్ చేశారు.