: స్పెయిన్ జంటపై రాజస్థాన్ లో దాడి... ఏం జరిగిందో చెప్పలేకపోతున్న యువతి!
రాజస్థాన్ లోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాలలో ఒకటైన పుష్కర్ ను సందర్శించాలని వచ్చిన ఆ స్పెయిన్ జంటకు చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడి ఓ హోటల్ లో దిగిన జంట, బైక్ ను అద్దెకు తీసుకుని వ్యాహ్యాళికి వెళ్లిన సమయంలో కొందరు స్థానికులు అటకాయించి వారిని వేధించారు. యువతి బట్టలు చించి దాడి చేశారు. యువకుడిని రాళ్లతో కొట్టారు. గాయాలపాలైన వారిని హోటల్ మేనేజర్ అజ్మీర్ ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర భయాందోళనలో ఉన్న ఆమె స్టేట్ మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.