: టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ సభలు, సమావేశాలు: ఏపీ బీజేపీ నిర్ణయం
ఏపీ టీడీపీ, బీజేపీ మధ్య కలహం మొదలైనట్టు కనబడుతోంది. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీకి చెందిన మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, సోము వీర్రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 24 వరకు సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బీజేపీపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ బీజేపీ భావిస్తోంది.