: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. కాగా, ఈ ఏడాది బాలికలు 69.04 శాతం ఉత్తీర్ణతతో బాలురపై పైచేయి చాటుకున్నారు. బాలురు 63 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఓవరాల్ గా ఈ ఏడాది ఉత్తీర్ణత 65.36 శాతంగా ఉంది. ఇక మార్కుల విషయానికొస్తే ఏ గ్రేడ్ 48.31, బీ గ్రేడ్ 31.81, సీ గ్రేడ్ 14.99, డీ గ్రేడ్ 4.90 శాతం మంది సాధించారు. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఫలితాల సీడీని ఈ సాయంత్రం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ ఏడాది సెకండియర్ పరీక్షలకు 10,10,915 మంది విద్యార్థులు హాజరయ్యారు.