: ఇరాక్‌లో మ‌రోసారి భ‌యాన‌క వాతావ‌ర‌ణం.. వరస ఆత్మాహుతి దాడులు


ఇరాక్ ప్ర‌జ‌లు మ‌రోసారి ఉలిక్కిప‌డ్డారు. వరుస ఆత్మాహుతి బాంబు దాడులతో ఈరోజు అక్క‌డ భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ దాడుల్లో 20 మంది మృతిచెందారు. 60 మంది గాయపడ్డారు. షియా వర్గీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్లు భద్రతాధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో జరిగిన దాడులకు పాల్పడింది తామేనని ఐసిస్‌ ఉగ్రవాదులు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే ఆ దేశ రాజధాని బాగ్దాద్ నగరంలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలోకి ఓ ఉగ్ర‌వాది చొర‌బ‌డి.. క్రీడాకారుల మధ్య తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 40మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ త‌ర్వాత సెంట్రల్‌ బాగ్దాద్‌లో ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో ముగ్గురు మరణించగా, 27 మందికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా, ఈరోజు జ‌రిగిన దాడి అక్క‌డ భ‌యాన‌క వాతావర‌ణాన్ని సృష్టిస్తోంది. రోజుల కాల వ్య‌వ‌ధిలోనే ఉగ్ర‌వాదులు ఆత్మాహుతి దాడులకు తెగ‌బ‌డుతుండ‌డంతో అక్క‌డ భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది.

  • Loading...

More Telugu News