: 9న నీటిపారుదల ప్రాజెక్టుల అవినీతిపై కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్!


తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులు దేశానికే గర్వకారణమంటూ అసెంబ్లీ వేదికగా, కేసీఆర్ ఇచ్చిన సుదీర్ఘ ప్రజెంటేషన్ ను తీవ్రంగా విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇవే ప్రాజెక్టుల్లో అవినీతి నెలకొని ఉందని ఆరోపిస్తూ, ప్రతిగా మరో ప్రజెంటేషన్ ను సిద్ధం చేసింది. దీన్ని 9వ తేదీన గాంధీభవన్ వేదికగా అందరికీ చూపించనున్నట్టు టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగట్టేందుకు తాము ముందుంటామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా తొలగించి, రాష్ట్రపతి పాలన విధించినందుకు నిరసనగా 6న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నామని వివరించారు. ముస్లిం రిజర్వేషన్లపై 10 లక్షల సంతకాలను సేకరించనున్నామని, 12న సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంత్యుత్సవాలను నిర్వహిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News