: అప్పుడు బ్రాడ్...ఇప్పుడు స్టోక్స్.. 'బ్యాట్'కు బలైన బౌలర్లు!


టీ20 టోర్నీ బౌలర్లపాలిట సింహస్వప్నంగా నిలిచే ఆట. బ్యాట్స్ మన్ ను కట్టడి చేసేందుకు ఎంత గొప్ప బంతిని సంధించినా, బ్యాట్స్ మన్ దూకుడు ముందు వారి ఆటలు సాగడం లేదు. 2011 టీ20 వరల్డ్ కప్ లో యువరాజ్ పరుగుల దాహానికి స్టువర్ట్ బ్రాడ్ బలైతే...తాజా టీ20 టోర్నీలో బ్రాత్ వైట్ పరుగుల దాహానికి బెన్ స్టోక్స్ బలయ్యాడు. బ్రాడ్ ఓవర్ లో ఆరు బంతులను యువరాజ్ సిక్సర్లుగా మలిచి శిక్ష విధిస్తే...కేవలం 6 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన దశలో విసిరిన నాలుగు బంతులను నాలుగు సిక్సర్లుగా మలిచి బ్రాత్ వైట్ టోర్నీని జట్టుకు అందించాడు. దీంతో బెన్ స్టోక్స్ గుండెబద్దలైంది. ఎన్నో అంచనాలతో యార్కర్లు సంధించినప్పటికీ బ్రాత్ వైట్ సిక్సర్లుగా మలిచిన విధానం అతనిని తలపట్టుకునేలా చేసింది. బంతిని ఎలా వేసినా అది బౌండరీ లైన్ అవతల పడడంతో ఓటమి భారం కంటే, జట్టును ఓడించానన్న భారంతో అతను కుంగిపోయాడు. తెల్లగా ఉండే అతని మొహం అవమానభారంతో ఎర్రబడింది. నీళ్లు నిండిన అతని కళ్లలో ఏమీ చేయలేని అసహనం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ మాట్లాడుతూ, స్టోక్స్ ను ఎంత ఓదార్చినా ఫలితం లేదని చెప్పాడు. అతను ఎవరితోనూ మాట్లాడడం లేదని, దీని నుంచి బయటపడేందుకు చాలా సమయం పడుతుందని ఇయాన్ మోర్గాన్ తెలిపాడు.

  • Loading...

More Telugu News