: ఉచిత వైఫై, ఆటోమాటిక్‌ డోర్స్‌ సౌకర్యాలతో ఇండియా ఫాస్టెస్ట్ ట్రైన్‌ రేపు వ‌చ్చేస్తుంది


ఇండియా ఫాస్టెస్ట్ ట్రైన్‌గా ప‌ట్టాలెక్కి చరిత్ర సృష్టించడానికి 'గటిమాన్‌ ఎక్స్‌ప్రెస్' సిద్ధ‌మైంది. ఢిల్లీ - ఆగ్రా మధ్య నడిచే ఈ రైలును రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు తన కార్యాలయం నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రేపు ప్రారంభించ‌నున్నారు. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 100 నిమిషాల్లో 210 కిలోమీటర్లు ప్ర‌యాణిస్తుంది. దీనిలో 12 ఏసీ కోచ్‌లున్నాయి. ఉచిత వైఫై సౌకర్యం, ఆటోమాటిక్‌ డోర్స్‌ తదితర సౌకర్యాలతో సుఖ‌వంత‌మైన ప్ర‌యాణాన్నందించ‌నుంది. ఉదయం 8 గంటల 10 నిమిషాలకు నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి ఆగ్రాకు 9 గంటల 50 నిమిషాలకు చేరుతుంది. ఆగ్రాలో తాజ్‌మహల్‌ మూసి ఉండే శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో ఈ రైలు ఢిల్లీ-ఆగ్రాల మధ్య నడుస్తుంది.

  • Loading...

More Telugu News