: పదోన్నతి పొందిన, కొత్తగా ఎంపికైన ఐపీఎస్ లతో భేటీ కానున్న చంద్రబాబు
పదోన్నతి పొందిన, కొత్తగా ఎంపికైన ఐపీఎస్ లతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈరోజు సాయంత్రం భేటీ కానున్నారు. ఐపీఎస్ అధికారులతో నేరుగా చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రాధాన్యాలను వారికి వివరించనున్నారు. ఈ సమావేశం అనంతరం ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వనునట్లు సమాచారం.