: మహేశ్ బాబు సరికొత్త రికార్డు... ట్విట్టర్ లో 20 లక్షల మంది ఫాలోవర్లు
ప్రిన్స్ మహేశ్ బాబు సరికొత్త రికార్డు సృష్టించాడు. 20 లక్షల మంది అభిమానులు మహేశ్ బాబు ట్విట్టర్ ఖాతాలో చేరారు. ఈ రికార్డు ఇంతవరకు ఏ తెలుగు హీరో సాధించకపోవడంతో ప్రిన్స్ అభిమానులు సంబరపడుతున్నారు. కాగా, మహేశ్ బాబు తన సినిమాల గురించి మాత్రమే కాకుండా పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. తన బ్లాక్ బస్టర్ మూవీ 'శ్రీమంతుడు' చిత్రం సమయంలో అభిమానులతో ఒక చాట్ సెషన్ ని మహేశ్ బాబు ఏర్పాటు చేయడం, అందులో అభిమానులు ఉత్సాహంగా పాల్గొనడం తెలిసిందే.