: బ్లాక్ మనీ వార్తలతో డీఎల్ఎఫ్, ఇండియాబుల్స్, అపోలో టైర్స్ కుదేలు!
బ్లాక్ మనీని దాచుకున్నారంటూ, పనామా పేపర్స్ విడుదల చేసిన జాబితాల్లోని వ్యక్తులకు సంబంధాలున్న కంపెనీలు స్టాక్ మార్కెట్లో నష్టపోయాయి. సోమవారం నాటి సెషన్లో డీఎల్ఎఫ్, ఇండియా బుల్స్ హౌసింగ్, అపోలో టైర్స్ వంటి కంపెనీల ఈక్విటీలను మదుపుదారులు పెద్దఎత్తున విక్రయించారు. సెషన్ ఆరంభంలోనే డీఎల్ఎఫ్ 1.77 శాతం, అపోలో టైర్స్ అర శాతం, ఇండియా బుల్స్ 0.2 శాతం నష్టపోయాయి. ఈ కంపెనీల ప్రమోటర్ల పేర్లు నల్లధనం దాచుకున్న వారి జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్ప లాభాల్లో నడుస్తోంది. మొత్తం 500 మందికి పైగా భారతీయుల పేర్లు జాబితాలో ఉండగా, వీరిలో 300 మంది వ్యక్తుల చిరునామాల వివరాలు పరిశీలించాల్సి వుందని పనామా పేపర్స్ వెల్లడించింది.